పయనించే సూర్యడు జనవరి 08 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం లో భాగంగా నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించి, 37 మంది విద్యార్థినులకు కంటి అద్ధాలకు, నలుగురిని చికిత్స కొరకు రిఫర్ చేయడం జరిగింది. విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, వైస్ ప్రిన్సిపాల్ విజయశ్రీ, సునీత ఆధ్యాత్మిక ఆఫీసర్ జగన్ ఆర్ బి ఎస్ కే సిబ్బంది డాక్టర్ సునీత, షహనాజ్ సిబ్బంది సైదులు కృష్ణవేణి, హెల్త్ అసిస్టెంట్ కృష్ణమూర్తి ఆశాలు సునీత లక్ష్మి పాల్గొన్నారు.