జగన్నాథ్‌పూర్ గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు పర్యావరణ అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 08 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా జగన్నాథ్‌పూర్ గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడంతో పాటు పర్యావరణ అవగాహన సదస్సు కూడా చేపట్టారు. గ్రామ సర్పంచ్ పరాచ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అగ్ని ప్రమాదం గుర్తించిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 8004255364కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ పద్మ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలియాజ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ గుర్రాల మౌనిక, వ్యవసాయ అధికారి నరేష్, కారోబార్ రమ్య, ఐకేపీ సీఏ దేవురావు, ఉప సర్పంచ్ మల్లయ్య, మాజీ సర్పంచ్ ఆత్రం భగవంత్ రావ్, గ్రామ పటేల్ సుధాకర్, గ్రామ యువతతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించారు.