జగ్గంపేట గ్రామ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై పిలుపు

పయనించే సూర్యుడు జనవరి : 8 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ జగ్గంపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం, తోట శ్రీ రాంజీ ఆదేశాల మేరకు జగ్గంపేట గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు గ్రామ అబ్జర్వర్లుగా గేడ్డం వెంకటేశ్వరరావు, అప్పన్న నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పనిచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీల్లో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం కల్పించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గంపేట మండల అధ్యక్షుడు రావుల గణేష్ రాజా మాట్లాడుతూ, జగ్గంపేట గ్రామానికి గేడ్డం వెంకటేశ్వరరావు, అప్పన్న నాగేశ్వరరావులను తోట నరసింహం, తోట శ్రీ రాంజీ అబ్జర్వర్లుగా నియమించారని తెలిపారు. వారి నాయకత్వంలో కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి 2029 ఎన్నికల్లో తోట నరసింహాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కార్యకర్తకు, బడుగు బలహీన వర్గాలకు మంచి రోజులు రానున్నాయని, 2029లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే జగ్గంపేట వార్డుల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి కమిటీల్లో నియమించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట టౌన్ అధ్యక్షుడు కాపవరపు ప్రసాద్, సీనియర్ నాయకుడు తుల్లా రాము, రాష్ట్ర పబ్లిసిటీ విభాగం జనరల్ సెక్రెటరీ రామకుర్తి జగాలు, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ జనరల్ సెక్రెటరీ కుందా జాన్ వెస్లీ, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కరుటూరు వీర్రాజు, జగ్గంపేట మండలం ఉపాధ్యక్షుడు భూమాడి గణపతి, మండల జనరల్ సెక్రెటరీ సప్ప రఘు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొండ్రు అమృత రావు, కొండబాబు తదితర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.