జగ్గయ్యపేట ఐటిఐ కాలేజీ నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించిన పారామౌంట్ అధినేత వెనిగళ్ళ సురేష్ ఘనంగా అభినందించిన వైఎస్ఆర్సిపి నేతలు. వెనిగళ్ళ సురేష్ సేవలు అభినందనీయంతన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 8 పెనుగంచిప్రోలు మండలం, కొనకంచి గ్రామంలో ఉన్న పారమౌట్ ఇండస్ట్రీ నందు పారామౌంట్ అధినేత వెనిగళ్ళ సురేష్ జగ్గయ్యపేట పట్టణం లో ఉన్న గెంటేల శకుంతలమ్మ (ఎస్ జి ఎస్) కళాశాల స్థలంలో ఐటిఐ కాలేజీ నిర్మాణానికి కోటి రూపాయలు విరాళంగా కమిటీ సభ్యులకు అందజేసిన సందర్భంగా వైసీపీ నాయకులతో కలిసి ఈరోజు వారి కార్యాలయం నందు మెమెంటో, పుష్పగుచ్చం అందజేసి ఘనంగా అభినందనలు తెలియజేసిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారామౌంట్ అధినేత వెనిగళ్ళ సురేష్ సేవలు అభినందనీయం అని, నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప పరిణామం అన్ని అన్నారు. స్థానికంగా ఉన్న యువతకు ఐటీతోపాటు టెక్నికల్ స్కిల్స్ ఎంతో అవసరమని ఆలోచన చేసి ఈ కాలేజీ నిర్మాణానికి కోటి రూపాయలు విరాళంగా అందజేశారని పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్ల నిర్మాణం మరియు వైకుంఠ వాహనాలు, ఇండస్ట్రియల్ ఉద్యోగస్తులకు ప్రోత్సాహం అయితేనే చాలా చాలా సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు, గుత్తా శంకర్రావు, బూడిద నరసింహ రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, గింజుపల్లి శ్రీను, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి పసుపులేటి సత్య శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి కాటేపల్లి రవి, పెనుగంచిప్రోలు సీనియర్ నాయకులు వూట్ల నాగేశ్వరావు, ఏసుపోగు శ్రీనివాసరావు, గూడపాటి శ్రీను, వైస్ ఎంపీపీ కనగాల శ్రీనివాసరావు, నియోజకవర్గ వాణిజ్య విభాగ డేరంగుల శ్రీనివాస్, నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షులు బండి రంజిత్, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షులు భైరబోయిన బాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *