డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 8 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కు సమీపంలో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అందుల వనరుల కేంద్రం ఆవరణలో అంధుల జీవనజ్యోతి, అక్షర ప్రదాత, బ్రెయిలీ లిపి నిర్మాత డాక్టర్ లూయి బ్రెయిలీ217వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ మరియు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లూయి బ్రెయిలీ ఒక లిపి కాదని అందుల ఆశాజ్యోతి గా మహోన్నత మార్గానికి శ్రీకారం చుట్టారని వారు పేర్కొన్నారు.. అందుల అభ్యున్నతికి అందత్వమనేది ఒక అడ్డు కాదని వారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారిలో ఆత్మవిశ్వాసం కల్పించే దిశగా తన తండ్రి ప్రోత్సాహం ద్వారా లిపిని తయారు చేయడం జరిగిందని తెలిపారు.. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు చెప్పడం జరిగిందని కళ్ళులేకున్నప్పటికీ ప్రపంచాన్ని ఏ విధంగా చూడడం అనేది ఆయన ఆలోచన ద్వారా బ్రెయిలీ లిపి లిఖించేందుకు ముందుకు రావడం జరిగిందని చెప్పారు. ఎప్పుడైతే ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ దివ్యాంగ విద్యార్థులైనప్పటికీ ఎవరు కూడా నిరాశ నిశ్రుహలకు గురి కాకుండా ఉండేందుకు ఆత్మవిశ్వాసం ధైర్యం ఆశ అనేది కలిగి ఉన్నప్పుడే వారు ఉన్నత స్థాయికి కచ్చితంగా ఎదగడం జరుగుతుందని తెలిపారు.. అలాగే స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి , కార్యదర్శి సిద్దయ్య మరియు స్నేహ సొసైటీ ఉపాధ్యాయ సిబ్బంది మరియు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతి ఒక్కరి సహకారంతో స్నేహా సొసైటీ దివ్యాంగ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు.. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకోవడం జరిగిందని తెలిపారు.. సకలాంగులకు దీటుగా స్నేహ సొసైటీ విద్యార్థినీ విద్యార్థులు రికార్డులు సృష్టిస్తున్నారని చెప్పారు.. అలాగే ఆగస్టు 15 వ తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సైతం జాతీయ సమైక్యత పాటపై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ఒక గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు.. అలాగే దివ్యాంగ విద్యార్థులైనప్పటికీ కూడాను చాలామంది సైంటిస్టులుగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం రాణించడం జరిగిందన్నారు.. ఉన్నత స్థాయికి ఎదగడానికి ఏది అడ్డు కాదని స్నేహ సొసైటీ దివ్యంగా విద్యార్థులు సైతం నిరూపిస్తున్నారని వారు అభినందించారు.. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్లో ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ ఉన్నతస్థాయికి ఎదిగే దిశగా ప్రోత్సాహం అందించాలని సూచించారు.. ఇదిలా ఉండగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దృష్టికి దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకురావడం జరిగింది.. అందుకు అనుగుణంగా వెంటనే స్పందించిన పోలీస్ కమిషనర్ వారి సమస్యలకు అలాగే దివ్యాంగులకు ప్రజలకు ఉపయోగపడే మంచి ఆలోచన అనేది తీసుకురావడం సంతోషకరమన్నారు.. అలాగే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి వారు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం అధిగమించే దిశగా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.. అయితే డయల్ 100 అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా దృష్టికి వచ్చేది కానీ అవగాహన లోపము మరి ఇంకా ఏ ఇతర సమస్యలు మరోసారి పూర్తిస్థాయిలో తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగ ఉద్యోగులు గాని విద్యార్థులు గాని ఎదుర్కొంటున్న సమస్యలు అనేది పసిగట్టి చెప్పడం ద్వారా వారి సమస్యలను తీర్చేందుకు పోలీస్ శాఖ సైతం కృషి చేస్తుందని తెలిపారు.. ఏదైతే అంద విద్యార్థుల ఉన్నతి కోసం లూయి రచించిన లిపి ఆయన ఆశయాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కష్టపడాలని సూచించారు.. అనంతరం నోటుబుక్కులను పెన్నులను పంపిణీ చేశారు. స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య అందుల వనరుల కేంద్రంలో ఉన్న వసతులు మరియు దివ్యాంగ విద్యార్థుల ఉన్నతి కోసం కావలసిన సౌకర్యాలను జిల్లా సంక్షేమ అధికారిని దృష్టికి తీసుకురావడం జరిగింది.. అలాగే జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో రాణించడం దివ్యాంగుల ఉన్నతికి నిదర్శనం అన్నారు అలాగే కంప్యూటర్ శిక్షణను ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు… ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, అర్బన్ సిడిపిఓ సౌందర్య, అంద ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయన్న , విసిఇఏ అధ్యక్షుడు సాగర్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఆరోగ్య రాజు మరియు 100 నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇలియాజుద్దీన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *