పయనించే సూర్యుడు జనవరి 8 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను మండల విద్యాశాఖ అధికారి రఘునందన్ శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రఘునందన్ శర్మ గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలంటే ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలనతో పాటు నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా తపస్ అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ, తమకు కల్పించిన హక్కులను సాధించుకునేందుకు సంఘటితంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తపస్ అధ్యక్షులు శ్రీ హరికృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, నిరంజన్, మహిళా కార్యదర్శులు శ్రీమతి యశోద, శ్రీమతి భాగ్యలక్ష్మి, మండల కార్యదర్శులు మహేష్ బాబు, వెంకటేష్, రామకృష్ణ, అశోక్, కుమార్ శ్రీను, రాధాకృష్ణతో పాటు ఎమ్మార్సీ సభ్యులు పాల్గొన్నారు.