
పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 8, తల్లాడ రిపోర్టర్ తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోడూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు తేదీ 07-01-2026 బుదవారం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ జన్మదినోత్సవం సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ అన్నారుగూడెం నందు విద్యార్థులకు స్నాక్స్ (అల్పాహారం) వితరణ. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మరియు డిస్టిక్ జాయింట్ సెక్రెటరీదారా శ్రీనివాసరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అంగర్ రిలీఫ్ వీక్ గా ప్రకటించి ఈ వారం రోజులు ప్రతిరోజు అన్న ప్రసాదం వితరణ నిర్ణయించి. 5వ రోజు అన్నారుగూడెం హైస్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం వితరణ . డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ ధారా శ్రీనివాసరావు స్పాన్సర్ చేసినారు వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో , ట్రెజరర్ అనుమోలు సర్వేశ్వరరావు , దొబ్బల శ్రీనివాసరావు, మాజీ సెక్రటరీ కటికి వెంకటేశ్వరరావు, తోట మురళి, హెచ్ఎం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థిని ,విద్యార్థులు మొదలగువారు పాల్గొన్నారు.