తల్లాడ సర్పంచి పెరిక నాగేశ్వరరావును సన్మానించిన కేటీఆర్..

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 8, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు (చిన్నబ్బాయి)ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సన్మానించారు. బుధవారం ఖమ్మంలో జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ తల్లాడ మేజర్ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి తో పాటు మండలంలో బీఆర్ఎస్ సర్పంచులను శాలువాలు, పూలమాలలతో సన్మానించి సత్కరించారు. సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో తల్లాడ మండల సర్పంచులు కార్యక్రమానికి హాజరై ఆయన చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు రెడ్డెం వీరమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుగ్గిదేవర వెంకట్ లాల్, దగ్గుల రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు