నట్టల మందు పంపిణీ చేసిన

★ సర్పంచ్ గజ్జల సృజన రమేష్

పయనించే సూర్యుడు జనవరి 08 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో పశుపోషణపై ఆధారపడిన రైతులు, గొర్రెల కాపరుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పశువులకు సకాలంలో నట్టల మందు వేయడం ద్వారా వ్యాధులు నివారించబడుతూ, పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డాక్టర్ పి. వంశీ, భవిత వరుణ్ ,పాల్గొని రైతులకు అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు. అలాగే గ్రామంలోని వార్డు మెంబర్లు కాల్వ అంజలి సంపత్, పాల్గొన్నారు..