నా ఊరు–నా సొసైటీ అంతా నా ఇష్టం అంటున్న సిఈఓ

పయనించే సూర్యుడు జనవరి 08 నేరెడుచెర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్ ) నేరెడుచెర్ల మండలం పెంచికలదిన్నె పి ఏ సిఎస్ సిఈఓ గుండు వెంకన్న పై చర్యలు తీసుకోవాలని అదే కార్యాలయంలో స్టాఫ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జింకల భాస్కర్ విలేకరుల సమావేశంలోఆరోపించారు . కార్యాలయం తెరిచి ఉండాల్సిన సమయంలో ఆయనకు ఇష్టం వచ్చినట్లు తాళాలు వేసుకొని వెళ్ళడం సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని. ఇదేమిటి అని ప్రశిస్తే నా ఇష్టం నా ఊరు .. నా సొసైటీ నేను ఇంతే చేస్తా అని సమాదానం ఇస్తున్నాడని వాపోయాడు .అధికారులు చొరవ తీసుకొని ఈ విషయం విచారణ చేపట్టి సిఈఓ పై చర్యలు తీసుకోవాలని కోరారు .