
పయనించే సూర్యుడు జనవరి 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) నిత్య జీవితంలో క్యాలెండర్ ఎంతో ఉపయోగపడుతుందని, ఈ 2026 నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపి, అందరికీ విజయాలు చేకూరాలని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆకాంక్షించారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రూపొందించిన షాద్ నగర్ నియోజకవర్గం యాదవ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆవిష్కరించి పలువురికి క్యాలెండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర క్యాలెండర్ ను రూపొందించడం పట్ల ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ ఒక ప్రణాళికతో లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. యాదవులంతా ఐకమత్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కొందుటి నరేందర్, అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నడికూడ రఘునాథ్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి, వావిలాల సుజీవన్, అఖిల భారత యాదవ మహాసభ తలుకా అధ్యక్షులు షాబాద్ మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు నక్క బాలరాజు యాదవ్, పాపయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, దొండ్ర ప్రవీణ్ యాదవ్, నరసింహ, నడికూడ అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..