పల్నాడు జిల్లా మైనార్టీ కార్యదర్శి సయ్యద్ కరిముల్లా సంచలన వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 8 యడ్లపాడు మండల ప్రతినిధి పల్నాడు జిల్లా మైనార్టీ కార్యదర్శి యడ్లపాడు మండలం కారుచోలా గ్రామానికి చెందిన నాయకుడు సయ్యద్ కరిముల్లా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం మైనార్టీల పట్ల వివక్ష చూపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “మైనార్టీల కోసం చాలా చేశామని చెప్పుకోవడం తప్ప, వాస్తవంగా ముస్లిం సమాజానికి రావాల్సిన హక్కులు, సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు కావడం లేదు. హామీలు మాటలకే పరిమితమయ్యాయి” అని ఆయన మండిపడ్డారు. ముస్లిం యువతకు ఉపాధి, విద్య, సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ సందర్భంగా సయ్యద్ కరిముల్లా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను గుర్తు చేస్తూ, ఆయన హయాంలో మైనార్టీలకు గౌరవం, భద్రత, సంక్షేమం దక్కిందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆర్థిక సహాయం, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని తెలిపారు. “వైఎస్ జగన్ మైనార్టీలను రాజకీయంగా మాత్రమే కాదు, సామాజికంగా కూడా బలపరిచారు. ముస్లిం సమాజానికి అండగా నిలిచిన నాయకుడు ఆయన మాత్రమే” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలపై మైనార్టీలు చైతన్యవంతులై తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని సయ్యద్ కరిముల్లా పిలుపునిచ్చారు…