పాలెం వెంకన్న దేవాలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల

★ ఈనెల 23న స్వామివారి కళ్యాణం,25న రథోత్సవం (తేరు), 27న ఉద్దాల సేవ ★ దేవాలయ చైర్మన్ మనుసాని విష్ణుమూర్తి

పయనించే సూర్యుడు జనవరి 8 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలిసిన శ్రీ అలెర్మెల్ మంగా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుండి 27 వరకు జరిగే పాలెం వెంకన్న బ్రహ్మోత్సవాల పోస్టర్ కరపత్రికలను బుధవారం నాడు దేవాలయ కార్యాలయ ఆవరణ లో విడుదల చేశారు. ఆలయ చైర్మన్ మనుసాని విష్ణుమూర్తి , కార్యనిర్వాన అధికారి సిహెచ్ రంగారావు లు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆలయంలో ఈనెల 20 నుండి 27 వరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 20న ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈనెల 21న పాలెం పూర్వ విద్యార్థుల సమితి వారిచే మండల స్థాయి భాగవత పోటీలు,ఆలయంలో ప్రత్యేక హోమాలు, ఈనెల 22న మండల స్థాయి సుప్రభాత పోటీలు,గరుడ వాహన సేవ, ఎదుర్కొల్లు, ప్రత్యేక హోమ పూజలు ఈనెల 23న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం, ఈనెల 24న వెంకటేశ్వర స్వామి భజన మండలి వారిచే ఉమ్మడి జిల్లా స్థాయి భజన పోటీలు, హోమాలు ప్రత్యేక పూజలు,ఈనెల 25న ఆదివారం రథసప్తమి నాడు స్వామివారి రథోత్సవం తేరు ఊరేగింపు,ఈనెల 26న సోమవారం నాడు ఉద్దాల మహోత్సవం, పండితులకు సన్మానం,ప్రత్యేక హోమపూజలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు పొందాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోనాసీ రామకృష్ణ, ఉప సర్పంచ్ శ్రీనివాసులు మాజీ మండల అధ్యక్షులు పి.శ్రీనివాస్ గౌడ్ ధర్మ మాజీ ధర్మకర్తలు గాడి సురేందర్,గంధం వెంకటేష్, ఆలయ పూజారులు రామానుజాచార్యులు, జయంత్,భక్తులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.