
పయనించే సూర్యుడు జనవరి 8 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్టేషన్‌లో నమోదైన వివిధ కేసుల వివరాలను పరిశీలించి వాటి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు పోలీస్ సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ వారి విధుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బంది కిట్లను కూడా తనిఖీ చేశారు విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ విధులను నిజాయితీగా నిర్వర్తించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు అలాగే పోలీస్ స్టేషన్ పరిసరాలలో పరిశుభ్రతను పరిశీలించి శుభ్రతను కాపాడుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ అల్లాదుర్గ్ సిఐ రేణుక రెడ్డి శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.