ప్రజల సమక్షంలో లెక్కలు వివరించాలి

★ భారతీయ జనతా పార్టీ మండల శాఖ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ జనవరి 8 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న)పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామ శివారులో గల ఆలేటి ఎల్లమ్మ తల్లి నీ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మారం రవి కుమార్ ,మండల ముఖ్య నాయకులు,కార్యకర్తలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు మారం రవి కుమార్ మాట్లాడుతూ అత్యంత మహిమగల శ్రీ ఆలేటి ఎల్లవ్వ జాతర సంక్రాంతి పండగకి జరుపుకోవడం ఆనవాయితీ , అని పండక్కి జిల్లాలోని, అదేవిధంగా పక్క జిల్లాల నుండి కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు అయితే జాతర జాతర సమయంలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో షాపులు నిర్వహించుకొనుటకు, బండి పార్కింగ్, కొబ్బరికాయల వేలం, ప్రసాదం వితరణ వేలం అదేవిధంగా హుండీ ఆదాయాలను గ్రామపంచాయతీ సర్పంచ్ సమక్షంలో నిర్వహిస్తుంటారు. కానీ గడిచిన చాలా సంవత్సరాల నుంచి అట్టి వివరాలు ప్రజల సమక్షంలో తెలపకుండా తప్పుదోవ పట్టిస్తూ గతంలో ఉన్న సర్పంచులు అట్టి డబ్బులని వారి దగ్గరినే ఉంచుకుంటున్నారని, అట్టి డబ్బులను ఆలేటి ఎల్లవ్వ పేరు మీద బ్యాంకులో అకౌంట్ ను ఏర్పాటు చేసి అకౌంట్లో జమ చేయాలని, ఈ సంవత్సరం కూడా ఎల్లమ్మ జాతర రాబోతుంది కాబట్టి దానికంటే ముందే గత సంవత్సరం వరకు ఉన్న ఆదాయ వ్యయాలను లెక్క చూపి చూపాలని డిమాండ్ చేశారు ఈసారి జరిగే జాతర నిర్వహణ పనులు వేలం పాటలు అన్నీ కూడా సజావుగా జరిపించాలని ప్రస్తుత సర్పంచిని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యులు దేవసాని కృపాకర్ ,మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజు, జిల్లా నాయకులు మచ్చ సునీల్ తదితరులు పాల్గొన్నారు