ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవం

పయనించే సూర్యుడు జనవరి 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 24 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ . లక్ష్మీ జ్ఞానేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా కళాశాల దాతలు రామ్మోహన్ రెడ్డి చేజర్ల ఎంఈఓ 1 ఇందిర , ఎంఈఓ 2 మస్తానయ్య , స్థానిక పీహెచ్ మెడికల్ ఆఫీసర్ మెహతాబ్ , స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రావణ్ , ఆదురుపల్లి జెడ్పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ , టికె పాడు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు . అరుణ కుమారి , మరియు తూర్పుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. వక్తల అతిథులు ఉపన్యాసం అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. అలాగే కళాశాలలో చదివిన కళాశాలలో చదివి 2025 డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన పూర్వ విద్యార్థులకు పూర్వ విద్యార్థులను సన్మానించడం జరిగినది. కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థుల చేత జరుపబడిన సాంస్కృతిక కార్యక్రమాలు సూపర్ లను ఆకర్షించాయి. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *