
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి08.01.2025 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె ప్రతినిధి జె.నాగ రాజ) పట్టణ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న బీసీ కాలనీలో బుధవారం పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు ఒక కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి కాలనీని సందర్శించారు ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిల్వ ఉండటం కాలువలలో చెత్తాచెదారం అలాగే ఉండటం ఆయన గుర్తించారు పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక్కడ నివసించేవారు రోగాల బారిన పడతారని ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అధికారులతో అన్నారు అనంతరం కార్యదర్శి శివకుమార్ను పిలిపించి కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు దీంతో కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆవుల రామచంద్రయ్య చంగల్ రాయుడు మునీంద్ర మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు