బోయకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి : గువ్వల రమేష్ రెడ్డి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 08.01.2026 మదనపల్లి అందమైన జిల్లా పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) శక్తి క్షేత్రం బోయకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి వైపు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి అన్నారు ఈ మేరకు బుధవారం ఏపిటూరిజం అధికారులు బోయకొండ గంగాపురంలోని కసిమిరెడ్డి చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించారు కొండపై నుంచి కింది వరకు ఒక కిలో మీటర్ మేరా రోప్ వే అదే విధంగా కసిమిరెడ్డి చెరువు సుందరీకరణ వంటి పనులు చేపట్టనున్నట్లు వారు వివరించారు పనులు పూర్తయితే బోయకొండలో ఆధ్యాత్మిక తో పాటు పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టూరిజం అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు బోయకొండ సుబ్బు పాలెం రెడ్డి మంజునాథ్ స్థానికులు పాల్గొన్నారు