భద్రతా ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాలు జరగవు..ట్రాఫిక్ ఎస్ఐ రత్నం

పయనించే సూర్యుడు జనవరి 8, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) భద్రత ప్రమాణాలు పాటించి ప్రయాణం చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని ట్రాఫిక్ ఎస్ఐ రత్నం పేర్కొన్నారు కాకినాడ ఎన్సిఎస్ కంపెనీలో రిలయన్స్ ఏర్పాటుచేసిన భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎస్సై మాట్లాడుతూ మద్యం సేవించగాని, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ గానీ, బండి కండిషన్ చూడకుండా ప్రయాణం చేస్తే తప్పక ప్రమాదాలు జరుగుతాయని ఇది ప్రతి ఒక్కరు గమనించాలని ఆయన తెలిపారు. ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబం ఉండాలంటే తప్పక సేఫ్టీ మెథడ్ ను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇంచార్జ్ లు కాకినాడ కొడాలి సునీల్, కడలి రాజేష్, సేఫ్టీ ఆఫీసర్ తన్మయి, జియో బిపి లాజిస్టిక్ కోఆర్డినేటర్ కె.వి మురళి, ఫ్లీట్ ఎడ్యుకేటు సలాది రాజ్ కిరణ్, టి మణికంఠ మరియు ట్రాన్స్పోర్ట్ మేనేజర్ కె విజయ కిరణ్ కే దొరబాబు మరియు డ్రైవర్సు పాల్గొన్నారు.