పయనించే సూర్యుడు జనవరి 08 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామ సర్పంచ్ మండల రజిత మహేష్ బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త లక్కి రెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కార్యాలయంలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సర్పంచ్ రజిత మాట్లాడుతూ రంగయ్యపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకారం అందించాలని మంత్రిని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి గ్రామ అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 30గుంటల భూమిని ప్రముఖ వ్యాపారవేత్త లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి గ్రామ ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకోవడానికి ఇచ్చిన భూమిలో, భూమి పూజకోసం రావాలని కోరామని, దీనికి మంత్రి సహకరిస్తానని చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నూతన సర్పంచ్ శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిమ్మల భీంరెడ్డి, చేవ్వల బుచ్చయ్య, సట్ల రఘుపతి, జిమ్మల మల్లారెడ్డి, పెండ్యాల మొగిలి, ఎలాబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు..