మానవత్వాన్ని చాటుకున్న బిజెపి నాయకుడు దత్తాత్రేయ

పయనించేసూర్యుడు న్యూస్ 8 జనవరి పుల్కల్ మండలప్రతినిధి పెద్దగొల్లనవిజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రమైన పుల్కల్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఒకటవ వార్డుమెంబర్ మన్నె రాములు కుమార్తె లక్ష్మీకి (20) రక్తం అవసరం ఉందని చరవాణి ద్వారా పుల్కల్ మండల బిజెపి నాయకుడు ముద్దాయిపేట గ్రామానికి చెందిన పెద్దగొల్ల దత్తాత్రేయకు చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో వెంటనే వస్తానని చెప్పి తన బోరు పొలం వద్ద యాసంగి వరి పంటకు ట్రాక్టర్ తో డ్రమ్ముచక్రాలను వేయిస్తున్న దత్తాత్రేయ వెంటనే పొలం దగ్గర నుండి సంగారెడ్డి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి రక్తం ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు దత్తాత్రేయ ఇప్పటికే 23 సార్లు రక్తదానం చేశారు. దత్తాత్రేయ మా పయనించే సూర్యుడు ప్రతినిధీ విజయ్ కుమార్ తో మాట్లాడుతూ ఎవరికైనా రక్తం అవసరమైతే తనకు సమాచారం అందిస్తే వెంటనే వచ్చి రక్తదానం చేస్తానని తెలిపారు. రక్తదానం చేయడం వలన నిండు ప్రాణాలను కాపాడిన వారి మి అవుతామని ఆయన తెలిపారు. రక్తం ఇవ్వడం వల్ల అనారోగ్యం బారిన పడతారని కొందరు అంటుంటారు. రక్తం ఇవ్వడం వల్ల ఆరోగ్యం చాలామెరుగుపడుతుందని ఒకసంవత్సరంలో మూడు లేదా.నాలుగుసార్లు రక్తం ఇవ్వొచ్చని దత్తాత్రేయ తెలిపారు.