ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన రంప ఎమ్మెల్యే శిరీషదేవి

★ పోలవరం జిల్లా అభివృద్ధికి సహకారం కోరిన ఎమ్మెల్యే

పయనించే సూర్యుడు జనవరి 8 పోలవరం జిల్లా ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల సమీక్షకు బుధవారం విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమె మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆమె నూతనంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పునరావాస మరియు ప్యాకేజి పై విన్నవించారు. మా పోలవరం జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు. దానికి ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.