మున్సిపాలిటీలను బీజేపికి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం

★ కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.

పయనించే సూర్యుడు: జనవరి 8: హుజురాబాద్ కాన్స్టెన్సీ ఇంచార్జి దాసరి రవి: హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను బిజెపికి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో, ఆయా మున్సిపాలిటీలలో బిజెపి అధికారంలో లేకపోయినప్పటికీ కేంద్రం నుండి ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు.అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అమృత్ పథకంలో చేర్చి కరీంనగర్ తరహాలో ఆధునికరించబోతున్నామని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం జమ్మికుంట డిగ్రీ అండ్ పీజీ కాలేజీ స్థలంలో సింథటిక్ స్టేడియం నిర్మాణానికి రూ.6.5 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక ఆర్డిఓ రమేష్ బాబు, తహసిల్దార్ తో కలిసి కాలేజీ స్థలాన్ని పరిశీలించారు. సింథటిక్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల ప్రిన్సిపల్, సిబ్బందితో సమావేశమయ్యారు. కాలేజీలోని కొంత స్థలం కబ్జా గురైందని ఆ స్థలాన్ని తిరిగి కాలేజీకి అప్పగించాలని కోరారు. అనంతరం కేంద్రమంత్రి బండి సంజయ్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, స్థానిక బిజెపి నేతలు, నాయకులు కలిసి పాల్గొన్నారు.