రంగవల్లులు మహిళల్లో దాగిఉన్న సృజనాత్మకత ను వెలికితీస్తాయి: గణేష్ ముదిరాజ్

పయనించే సూర్యుడు, జనవరి 8 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ రంగవల్లులు మహిళల్లో దాగిఉన్న సృజనాత్మకత ను వెలికి తీస్తాయనీ మియాపూర్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ అన్నారు.మన సంస్కృతి,సాంప్రదాయా లకు ప్రతీకలే పండుగలనీ,సంక్రాంతి పర్వ దినాన్ని పురస్కరించుకొని మక్త లోని లక్ష్మీ వెంకటనగర్ లో గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మహిళలకు రంగువల్లుల పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి బహుమ తులు అందజేశారు. పోటీలలో గెలుపొం దిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు ప్రోత్సాహక బహుమ తులు అందజేశారు. సంస్కృతి, సంప్రదా యాలు నానాటికి కనుమరుగ వుతున్నా యనీ,నేటి యువతరంకూడా మన ప్రాచీ న సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగిం చేందుకై ఈ పోటీలు నిర్వహిస్తు న్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో ప్రథమ బహుమతి శిరీష, ద్వితీయ సత్య దేవి, తృతీయ బహుమతి ప్రసన్న లు గెలుచుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు,కాలని వాసులు పాల్గొన్నారు.