పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి జిల్లా, సెంటినరీ కాలనీ: 08-01-2026 సింగరేణి సంస్థ రామగుండం -3 ఏరియా జనరల్ మేనేజర్ గా బుధవారం ఎస్.మధుసూదన్ పదవి బాధ్యతలను చేపట్టారు.వారికి అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, వివిధ విభాగాధిపతులు, అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం రామగుండం రీజియన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్.మధుసూదన్ బదిలీ పై రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ గా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరం సమష్టి కృషితో విధులు నిర్వహిస్తు భద్రత, నాణ్యతతో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించుకోవాలని అన్నారు.
