పయనించే సూర్యుడు జనవరి 8 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని క్రికెట్ అసోసియేషన్ ఉప కేంద్రంలో క్రికెట్ సెలక్షన్స్ కర్నూలు జిల్లాక్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపకేంద్రం అయినటువంటి ఆదోనిలో అండర్ 12 మరియుఅండర్ 14 బాలురకుఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల క్రికెట్ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, క్రికెట్ మైదానంలో ఈనెల 11.01.2026 నఉదయం 8:30 గంటలకు క్రికెట్ సెలక్షన్స్ ఉంటాయని ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయబడుతుందని, కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవేంద్ర గౌడ్ ఆదోని క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విట్టా రమేష్ తెలిపారు. అండర్ 12 విభాగంలో పాల్గొనే క్రికెట్ క్రీడాకారులు1.09.2014 తర్వాత జన్మించి ఉండాలి. అదేవిధంగా. అండర్ 14 విభాగంలో పాల్గొనే క్రికెట్ క్రీడాకారులు 1.9.2012 తర్వాత జన్మించిఉండాలని. తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్, ఒరిజినల్ ఆధార్ కార్డు మరియు వ్యక్తిగత క్రికెట్ కిట్, వైట్ అండ్ వైట్ తో హాజరు కావాలని తెలిపారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ కోచ్ బాలాజీ 8790749669