వేదాద్రి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు వేలంపాటలు వాయిదా

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్.టీ.ఆర్. జిల్లా. జగయ్యపేట నియోజకవర్గం జనవరి 8 జగ్గయ్యపేట మండలం, వేదాద్రి గ్రామములో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము నందు దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు సమక్షములో ది. 07-01-2026 బుధవారం ఉదయం కూల్ డ్రింక్స్-పటములు-బొమ్మలు అమ్ముకొను హక్కునకు లైసెన్సు అప్పగించిన నాటి నుండి ‘2’ సంవత్సరముల కాలపరిమితికి నడుపుకొనుటకు దేవస్థాన ప్రాంగణమందు బహిరంగ వేలము పాట/టెండర్లు జరుపగా ‘4’ గురు ధరావత్తు చెల్లించి వేలము పాటలో ఎవరు పాల్గొనలేదు మరియు టెండర్లలలో కూడా ఎవరు పాల్గొనని కారణంగా సదరు లైసెన్సుకు ది. 13-01-2026 రోజుకు వేలంపాట/టెండర్లు వాయిదా వేయడమైనదని దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ వెలగపూడి లక్ష్మణఇందిరాదత్తు మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు తెలియజేసినారు.