పయనించే సూర్యుడు న్యూస్: జనవరి 08:గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ నాయుడు మండల పరిధిలోని గంజిహాల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు 50 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సామూహికంగా చేరారు. _కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుకమ్మ కార్యాలయం,కర్నూలులో జరిగిన ఈ కార్యక్రమంలో బుట్టా రేణుకతో పాటు జిల్లా యాక్టివిటీ కార్యదర్శి నాగేష్ నాయుడు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు డి. నజీర్ అహమ్మద్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోనెగండ్ల మండల గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు గంజిహాల్లి ముల్ల రఫీక్,నరసింహ ఆచారి ఆధ్వర్యంలో జరిగిన, ఈ చేరిక కార్యక్రమంలో ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై విశ్వాసంతో టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరినట్లు తెలిపారు. టీడీపీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో స్వామిదాసు, ఏసన్న, మత్తయ్య, యాకోబు, సల్మాన్ రాజ్, ఆనంద్, రాజు, విజయ్, డేవిడ్, సుధాకర్, కిషోర్, మల్లికార్జున, చిన్న మునిస్వామి, రమేష్, భాస్కర్‌తో పాటు మరికొందరు కలిపి మొత్తం 50 మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చేనేత అధ్యక్షులు ఎంకె శివ ప్రసాద్, ఎమ్మిగనూరు మండల యువజన విభాగ అధ్యక్షులు బనవాసి బసిరెడ్డి, ఎమ్మిగనూరు పట్టణ 15వ వార్డు ఇంచార్జ్ సయ్యద్ ఫయాజ్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు ఎన్. వై. షరీఫ్, పూర్ణ నాయుడు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.