శాంతి స్కూలులో సువాసినుల పూజ మహోత్సవం

పయనించే సూర్యుడు జనవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఈరోజు స్థానిక ఉప్పలగుప్తం శాంతి స్కూల్ లో సువాసినుల పూజా మహోత్సవం జరిగింది. ఒక సువాసిని స్త్రీని పరదేవతగా భావించి మరొక సువాసిని స్త్రీ చేసినటువంటి పాదోపచార పూజా కార్యక్రమమే ఈ సువాసిని పూజ మహోత్సవం అని పూజ నిర్వహించిన జయలక్ష్మి తెలిపారు. తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది. దేవతలకు పూజ చేసినట్టుగా సువాసన స్త్రీకి పూజను చేయడమే ఈ సువాసినీ పూజ. స్త్రీలను గౌరవించడం పరదేవతలుగా భావించడం మన సనాతన సంప్రదాయమని ప్రస్తుత తరుణంలో పెడదోవలకు పోతున్న ఈ తరం విద్యార్థులకు మన సాంప్రదాయాన్ని పరిచయం చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు శాంతి స్కూల్ ప్రిన్సిపాల్ శాంతిస్వరూప్ తెలిపారు. సభాధ్యక్షతగా వ్యక్తిత్వ వికాస నిపుణులు సీఈఓ సాంబశివరావు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ శ్రీ శక్తి పీఠ వ్యవస్థాపకులు శ్రీ రమ్యానంద భారతి స్వామిని జన్మదినమును పురస్కరించుకొని మాతకు అంకితం చేస్తున్నామని తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయులు శివరావు మాస్టర్ దంపతులు మాట్లాడుతూ పిల్లల్లో ఆధ్యాత్మిక భావనలు, ప్రస్తుత విద్యార్థుల్లో స్త్రీలను గౌరవించడం, అత్యంత ఆవశ్యకమని తెలిపారు. కరస్పాండెంట్ వెంకట సత్య ప్రసాద్, జయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. దీనిలో మౌనిక, రాజేశ్వరి, దేవి, భారతి, సౌజన్య, సుమ, ప్రసన్న, రోషిని, సత్యవేణి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.