సరిలేరు మీకు ఎవరుఘనంగా డిప్యూటీ కలెక్టర్ వాకా శ్రీనివాసులు రెడ్డి జన్మదినోత్సవం

పయనించే సూర్యుడు జనవరి 8 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ గుంతకల్ పట్టణంలో బుధవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నందు డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వాకా శ్రీనివాసులు రెడ్డి జన్మ దినోత్సవం సందర్భంగా గుంతకల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు రోగులకు పండ్లు.బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. యాచకులకు పలుచోట్ల ఫుడ్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ యాదవ్* మాట్లాడుతూ 2023 సంవత్సరం నవంబర్ నెల లో గుంతకల్ ఆర్డీవో గా బాధ్యతలు తీసుకున్న వాకా శ్రీనివాసరెడ్డి 2024 సంవత్సరం అక్టోబర్ నెల లో ఆయన డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొంది బదిలీ వెళ్లడం జరిగిందని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారని గతంలో గుంతకల్లు ఆర్డీవో గా 11 నెలలు ఆయన నిర్వహించిన విధులు అమోఘమని 2024 సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాఫీగా ప్రశాంతంగా జరగడానికి కీలక పాత్ర పోషించారని. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలలో గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం కలిగి ఉండడం వల్ల రాష్ట్రంలోనే మొట్టమొదటి ఐఎస్ఓ గుర్తింపు పొందడంలో ఆయన పాత్ర మరవరానిదని. అలాగే జిల్లాలోనే అత్యధికంగా గుంతకల్ రెవిన్యూ డివిజన్ పరిధిలో 601 ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వాలు నమోదు కృషి చేశారని నీతి నిజాయితీ గలిగిన అధికారిగా అనేకమంది ఉన్నత అధికారులు అనధికారులు చేతుల మీదుగా ప్రశంసల పొందిన ఆయన నేటి సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు ఈకార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్. సుధాకర్. నీలకంఠ. శంకర్.తదితరులు పాల్గొన్నారు