పయనించే సూర్యుద్/ జనవరి 8/ దిడ్డి రాము/ జమ్మికుంట రూరల్; సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సి.హెచ్. లచ్చయ్య తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులకు అవకాశం, బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రిన్సిపల్ లచ్చయ్య మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ కులాలకు చెందిన అర్హులైన విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చేరేందుకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకునేందుకు ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 21వ తేదీ లోపు అవసరమైన ధ్రువపత్రాలతో సమీపంలోని మీసేవ కేంద్రాల్లో రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తుతో పాటు, జనన ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, గత తరగతి మార్కుల మెమో, అందించాల్సి ఉంటుందని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22న ఎంపిక చేసిన గురుకుల పాఠశాలల్లో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ లచ్చయ్య తెలిపారు. పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసిన పాఠశాలలోనే ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేశారు. గురుకుల విద్యాసంస్థల్లో, నాణ్యమైన బోధన, ఉచిత వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫార్ములు, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందిస్తున్న ఈ విలువైన అవకాశాన్ని ప్రతి అర్హత కలిగిన విద్యార్థి తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సి.హెచ్. లచ్చయ్య కోరారు.