పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 8: అశ్వాపురం గ్రామపంచాయతీ లో గల చింతల చెరువు కు దగ్గర లోని స్మశాన వాటికకు దారి ని కేటాయించాలి అని తహసిల్దార్ మణిదర్ కి అశ్వాపురం సర్పంచ్ బానోతు సదర్ లాల్ వినతి పత్రం సమర్పించారు. అశ్వాపురం ఎస్.సి కాలనీలో కాని కాలవబజార్ లో కానీ ఎవరైనా చనిపోతే పెళ్లిళ్లు,ఫంక్షన్లు పండగల సమయంలో కూడా ఇండ్ల మధ్య నుంచి మృతదేహాలను తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తున్నది, కావున ఊరి బయటి నుండి స్మశానవాటికకు మృతదేహాలను తీసుకుని వెళ్ళుటకు గతం లో ఉన్న కలిబాట సుమారు 120 మీటర్లను గ్రామపంచాయతీ వారికి కేటాయించగలరని కోరినారు. పంచాయతీ కి కేటాయిస్తే అట్టి రోడ్డు ను అభివృద్ధి చేస్తాము అని వినతి పత్రం సమర్పించగా ఇట్టి విషయాన్ని తహసిల్దార్ మణిధర్ త్వరగా పరిష్కరిస్తారని తెలియచేసినారు. ఇట్టి కార్యక్రమం లో ఉపసర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.