పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 8 టంగుటూరు మండల రిపోర్టర్ 44వ సీనియర్ జాతీయ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ 2026 జనవరి 09 నుండి 11 వరకు షోలాపూర్ (మహారాష్ట్ర)లోని మల్షిరాస్లో నిర్వహించ బడుతుందని ఈ పోటీలకు ప్రకాశం జిల్లా కు చెందిన మహిళల విభాగం లో మిరియాల పద్మ, పురుషుల విభాగం లో తుల్లిబిల్లి క్రాంతికుమార్, గుండాల పెంచలరావు, శీలం రిషి ఎంపికయ్యారని షూటింగ్ బాల్ కోచ్ గుడిపల్లి మురళి అభినందనలు తెలిపారు. ఇటీవల రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలలో ప్రతిభ కనపరచిన కారణం గా జాతీయ స్థాయి పోటీలకి ఎంపికయ్యారని కోచ్ గుడిపల్లి మురళి తెలిపారు. జాతీయ స్థాయి లో ప్రతిభ కనపరచాలని షూటింగ్ బాల్ స్టేట్ సెక్రటరీ పరశురామ్ ఆశభావం వ్యక్తం చేశారు.