ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

★ పారిశుద్ధ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ★ గట్లనరసింగపూర్ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్

పయనించే సూర్యుడు జనవరి 09 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రోడ్డుకి ఇరువైపులున్న మట్టిని శుభ్రపరిచారు.. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర సమీపిస్తున్న సందర్భంగా ఇతర గ్రామాల నుండి ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం చేయడం కోసం రోడ్డుకి ఇరువైపులా చెత్తను తీసివేయడం జరిగిందని తెలిపారు.. గ్రామంలో ఎలాంటి సమస్యలున్న గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొడిగె శ్రీనివాస్, కార్యదర్శి గుడి కందుల మధు, వార్డు సభ్యులు బొల్లంపల్లి రాజయ్య, మాడుగుల అమర్, పంచాయతీ సిబ్బంది, ములుగు కిరణ్, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు..