ఆదోని జిల్లా చేయకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం

(పయనించేసూర్యుడు జనవరి 9 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి): ఆదోనిని జిల్లా చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత 54 రోజులుగా వివిధ సంఘం వారు విప్లవకారులు విద్యార్థి సంఘాల వారు ప్రభుత్వము ప్రతిపక్షము కుల మత వర్గ వర్ణ వ్యాపారస్తులు ఇలా ప్రతి ఒక్కరు తేడా లేకుండా రిలే నిరాహార దీక్ష చేయడం అందరికి తెలిసినటువంటి విషయమే ఇన్ని రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్న ప్రభుత్వం నిమ్మక నిరీత్నట్లు వ్యవహరించడం కాదు విడ్డూరం అని సామాజిక విశ్లేషకులు న్యాయవాది జర్నలిస్టు డాక్టర్ జి నల్లారెడ్డి తెలియజేశారు అదేవిధంగా నటరాజ్ స్వామి చెన్న బసప్పలు కూడా శిబిరాన్ని సందర్శించి రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఆదోని జిల్లా ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని ఇక్కడ అన్ని రకాల భౌగోళిక వసతులు ఉన్నాయని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తక్షణమే ఆదోని జిల్లా చేయాలని లేని పక్షంలో ప్రభుత్వము వచ్చే ఎన్నికల్లో చాలా ఇబ్బంది పడుతుందని ప్రజలు గుణపాఠం తెలుపుతారని చెప్పారు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు విశ్రాంతి ఉపాధ్యాయులు కృష్ణమూర్తి విప్లవ సంఘ నాయకులు కోదండ మొదలైన వారు మేము సైతం అంటూ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం అభినందనీయమని ప్రతి రోజు కూడా రిలే నిరాహార దీక్ష చేయించడంలో వారి వంతు పాత్ర ఎంతో ఉన్నదని తెలియజేశారు ప్రభుత్వ ప్రతిపక్షాలు కూడా ముకుమ్మడిగా ఈ దీక్షకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎన్ని రోజులైనా ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆమె వచ్చేవరకు దీక్షను కొనసాగించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు