ఆరోగ్యలక్ష్మి అద్భుతం

★ కొడవటి మెట్ట సర్పంచ్ మోదుగు తిరుమలరావు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 9, తల్లాడ రిపోర్టర్ మండల కేంద్రంలోని కొడవటిమెట్ట (రెడ్డి గూడెం)గ్రామ సర్పంచ్ మోదుగు తిరుమల్ రావు అధ్యక్షతన ఆరోగ్య లక్ష్మి పథకం యొక్క కమిటీ మీటింగ్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య లక్ష్మి పథకం అద్భుతమని గర్భిణీలు పాలిచ్చే మహిళలు ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం ఒక పోషకమైన భోజనాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తుందని.ఈ రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తుందని. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పోషక ఆహారం గురించి పరిశుభ్రత,ఆకుకూరల ప్రాముఖ్యత గురించి వివరించి తర్వాత మూడు సంవత్సరముల నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం వేడుక సర్పంచ్ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జగన్మోహన్రావు,గ్రామ సెక్రెటరీ మాడపల్లి వెంకటలక్ష్మి,గర్భిణీ స్త్రీలు, ఏఎల్ఎంఎస్సి, అంగన్వాడి టీచర్ కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.