పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 9 బోధన్ :బోధన్ పట్టణంలోని ఇందూర్ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముందస్తు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణను పల్లె పండుగ వాతావరణాన్ని తలపించేలా అలంకరించగా, విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు బోగీ మంటలు, పిండి వంటలు, హరిదాసు వేషధారణ, కోలాటాలు, జానపద నృత్యాలతో ఆకట్టుకున్నారు. వారి ప్రదర్శనలు అతిథులను ఆనందపరిచయు ఈ కార్యక్రమానికి బోధన్ ఏసిపి శ్రీనివాసరావు, పట్టణ ఎస్హెచ్వో వెంకటనారాయణ, డీటీఓ ఉమామహేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ట్రస్మా జిల్లా అధ్యక్షులు పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్, ట్రస్మా పట్టణ అధ్యక్షులు హరికృష్ణ, ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు
