ఉట్నూర్‌లో 12న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా

పయనించే సూర్యుడు జనవరి 09 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన ఐటీఐ ఏటీసీ కళాశాలలో ఈ నెల 12వ తేదీన ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అప్రెంటిషిప్ మేళాను సద్వినియోగం చేసుకుంటే చదువుతూనే డబ్బులు సంపాదించే అవకాశం లభిస్తుందన్నారు రాష్ట్రంలోని వివిధ కంపెనీలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ కంపెనీల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *