పయనించే సూర్యుడు రాజంపేట న్యూస్ జనవరి 09: రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు గురువారం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ను ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో వారితోపాటు జనసేన నాయకులు, మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మాజీ జెడ్పిటిసి షబ్బీర్ అహ్మద్, బిజెపి నాయకులు కృష్ణ యాదవ్, విశ్రాంత పోలీసు అధికారి కడిమెల్ల శ్రీనివాసరాజు, పెనిగలపాటి పిచ్చయ్య నాయుడు, వినోద్ వర్మ, జనసేన మీడియా కోఆర్డినేటర్ చింతల శివ తదితరులు పాల్గొన్నారు.