ఒకే ఒక్క ఓటుతో గెలిచినకొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోదారి శోభారాణి (మాధవి) – రవి గ్రామాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతా గ్రామపంచాయతీని జిల్లాలోనె మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా

* కొత్తపల్లి సర్పంచ్ శోభారాణి (మాధవి)- రవి తో పాటు ఉపసర్పంచ్ నోముల రాజేష్ గౌడ్

పయనించే సూర్యుడు జనవరి 9 కరీంనగర్ న్యూస్: కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోదారి శోభారాణి(మాధవి) మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా నన్ను ఒక్క ఓటుతో గెలిపించిన నా గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు సకృషి సహకార మహిళా పొదుపు సంఘం కొత్తపల్లి అధ్యక్షురాలుగా నేను ఏడు సంవత్సరాలు గా పని చేసినాను మరియు పోరండ్లలో నేను ప్రతిభ మహిళ పొదుపు సహకార సంఘంలో రెండు సంవత్సరాలు పని చేసినాను నేను చేసిన పనికి నాకు ఒక జ్ఞాపకార్థం అవార్డు కూడా ఇచ్చినారు నేను కొత్తపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా మా పాలకవర్గం తోటి ప్రమాణ స్వీకారం రంగ రంగ వైభవంగా చేసినాము నేను కొత్తపల్లి గ్రామంలో గ్రామ ప్రజలందరికీ సేవ చేయడానికి ముందుకు వచ్చినాను గ్రామంలో ఉన్న సమస్యలు సిసి రోడ్లు డ్రైనేజీలు వీధిదీపాలు గ్రామంలో రైతుల కు ఐకెపి సెంటర్ మరియు అక్కాచెల్లెళ్లకు బతుకమ్మ షూట్ ను ఏర్పాటు చేస్తానని అన్నారు గ్రామం పరిశుద్ధ కార్మికుల తోటి చెట్లు గాని డ్రైనేజీలు గాని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతానని అన్నారు నూతన సిసి రోడ్లు డ్రైనేజీలు వీధిదీపాలు మంజూరు చేపిస్తానని అన్నారు గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికి వితంతు పింఛన్లు మరియు వికలాంగుల పింఛన్లు ఇప్పిస్తానని అన్నారు గ్రామంలో మెయిన్ రోడ్డుకు సీసీ కెమెరాలు కొత్తయి పాలకవర్గం తోటి చర్చించి వాటిని కూడా పెట్టిస్తామని అన్నారు గ్రామంలో కొత్త గ్రామపంచాయతీని పాలకవర్గం తోటి చర్చించి గ్రామపంచాయతీ భావనాన్ని నిర్మిస్తామని అన్నారు గ్రామంలో 24 గంటలు అందుబాటులో నిస్వార్థ సేవకురాలుగా ఉంటానని అని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *