పయనించే సూర్యుడు జనవరి 09 (మేడ్చల్ నియోజకవర్గం మాధవరెడ్డి ప్రతినిధి) కంది ప్రేమ్ కుమార్ భార్య కంది లావణ్య అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు కంది ప్రేమ్ కుమార్ స్నేహితుడు మాజీ ఎంపీ వెంకటేష్ నేత తో కలిసి మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి శోకసంతప్త కుటుంబాన్ని పరామర్శించారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన నేతలు, మృతాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కఠిన సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని కోరుతూ, తమ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అకాలంగా జరిగిన ఈ మరణం కుటుంబానికి తీరని లోటుగా మారిందని పేర్కొన్న ఏనుగు సుదర్శన్ రెడ్డి ,కంది ప్రేమ్ కుమార్ కుటుంబానికి బీజేపీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ సంతాపాన్ని తెలియజేశారు.