పయనించే సూర్యుడు న్యూస్ మందమరి మండల రిపోర్టర్ బొద్దుల భూమయ్య జనవరి 9 సింగరేణిలో పెండింగ్ లో ఉన్న కార్మిక ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో చర్చించకపోవడం బాధాకరమని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలు గత కొన్ని దశాబ్దాల నుండి 1996లో 1,20,000 ఉద్యోగాలు ఉంటే ప్రస్తుతం 2026 సంవత్సరానికి గాను 36 వరకు తగ్గిపోయినాయి 80,000 మంది కార్మికుల జీవితాలను వీధిపాలు చేసినారు వారికి పెన్షన్లు వైద్య సదుపాయాలు పెరగడం లేదు వేలాది మంది సింగరేణి ఉద్యోగులకు మారుపేరులను సరి చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ పేర్లను మార్చుకొని అవకాశం కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన సమస్యను యాజమాన్య దృష్టికి తీసుకువచ్చినప్పటికీ దాటవేసే ధోరణి అవలంబిస్తుందని తండ్రి ఉద్యోగాలు కొడుకులకు రాక కుటుంబాల పోషణ భారం అవుతుందని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గత కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగాల కుదింపు ప్రక్రియ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పరిష్కరించక పోయింది ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు పరిష్కరించలేక పోయింది బాధిత కుటుంబాలు శాంతియుతంగా సింగరేణి వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తూ ఏరియా అధికారులకు కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు మరియు ఎంపీలకు సింగరేణి ఏరియా అధికారులకు సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘాలకు నాయకులకు మారుపేరుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికైనా హామీ ఇచ్చిన గెలిచిన కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. అని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ డిమాండ్ చేసినారు.