పయనించే సూర్యుడు జనవరి 9 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (సరస్వతి బ్లాక్) లో ముందస్తుగా సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పర్వదినం ప్రతిబింబించేలా విద్యార్థుల వేషాదరణ అందరిని ఆకట్టుకున్నాయి. విద్యార్థినిలు ముగ్గులు వేసి అందరిని మెప్పించారు. కైట్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముందుగా విద్యార్థినిలకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. పాఠశాల కరస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అందరికీ ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో సంక్రాంతి పండగ ముందస్తుగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.