
పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి.09.01.2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కేంద్ర ఎస్.టి కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జి రెడ్డి తన కార్యాలయంలో ఆత్మీయoగా స్వాగతం పలికారు చైర్మన్ కార్యాలయంలో సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో గిరిజనులకు సంబంధించిన కీలక సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది ముఖ్యంగా జిల్లాల వారీగా ఉన్న ట్రైబల్ సమస్యలను కేంద్ర ఎస్.టి కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జి రెడ్డి గిరిజన గ్రామాలలో అధికంగా ఉన్న అడవి ప్రాంతం (ఫారెస్ట్) సమస్యలు భూ సమస్యలు మరియు వాటి వల్ల గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు అలాగే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు జిల్లాల వారీగా సమాచారం అందించారు.