పయనించే సూర్యుడు జనవరి 9 ఖానాపూర్ (నిర్మల్ జిల్లా) టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ చిన్న–పెద్ద తారతమ్యం మరిచి పార్లమెంటరీ పక్ష నాయకుడు రాహుల్ గాంధీపై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో గౌరవం, సంయమనం అవసరమని, బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయమన్నారు. గత 15 నెలల కాలంలో అనేకమంది సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, భూములు అమ్ముకొని రోడ్డున పడిన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులకు బాధ్యత వహించాల్సిన వారు సర్పంచులను సన్మానించే అర్హత కోల్పోయారని విమర్శించారు. మరోసారి గాంధీ కుటుంబంపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేటీఆర్ తన మాటలను అదుపులో పెట్టుకోవాలని, లేనియెడల తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని బాణావత్ గోవింద్ నాయక్ స్పష్టం చేశారు.