కేశవపురం గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న

★ సర్పంచ్ వనిగడ్ల మాధవరావు ఉప సర్పంచ్ సాధం రమేష్ ★ ఏఈఓ హసీనా

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 9, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల కేశవపురం గ్రామంలో గురువారం ఉదయం 6 గంటల నుండి ఏఈఓల ముందస్తుగా గ్రామంలో యూరియా కూపన్లు రైతులకు పంపిణీ చేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారి ఎండి తాజుద్దీన్ పరిరక్షణలో ప్రశాంతంగా యూరియా పంపిణీ జరుగుతుంది. కేశపురం గ్రామంలో రైతులకు యూరియా ను గ్రామ సర్పంచ్ వనిగండ్ల మాధవరావు, ఉపసర్పంచ్ సాధం రమేష్ ఏఈఓ హసీనా, గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు వార్డు సభ్యులు చిన్నంశెట్టి శ్రీకాంత్ రైతులకు యూరియాను అందజేశారు.