కొండ విజయ్ చే స్పందన సేవా సంస్థ వారికి ఐడి కార్డుల పంపిణీ

పయనించే సూర్యుడు, జనవరి 09 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) హోప్ ఫౌండేశన్ ఫౌండర్ చైర్మన్ కొండ విజయ్ స్పందన సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి చేతుల మీదుగా స్పందన సేవా సంస్థ అధ్యక్షులు కొమ్ముల శ్యామ్ ఆధ్వర్యంలో నూతనంగా జాయిన్ అయినా వారందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కొండ విజయ్ మాట్లాడుతూ స్పందన సేవా సంస్థ కార్యక్రమాలు బాగున్నాయని మరింత సేవ చేయడానికి, ఆహార పంపిణీ కొరకు కిరాయి వాహనాలపై ఆధారపడే సంస్థ కొరకు త్వరలోనే ఓమ్ని లాంటి బండి కొని పెడతానని హామీ ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు సంస్థ సభ్యులు తెలియజేశారుఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ. షేక్ సలీం,ట్రెజరర్. అలిగే వినోద్, బేగారి ఆనంద్,రాంబాబు, రవి, అశోక్, లాలూ ప్రసాద్, మల్లేష్ యాదవ్, షేక్ హాజీ, పెండ్యాల ప్రశాంత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.