కొత్తకొండ దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

★ బిజెపి మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్

పయనించే సూర్యుడు జనవరి 09 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఉత్తర తెలంగాణ ప్రసిద్ధి చెందిన కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో కట్టుబడి ఉన్నామని బిజెపి మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జాతర సందర్బంగా రోడ్డుల మరమ్మతులకు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అడిగిన వెంటనే కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ స్వంత నిధులతో రోడ్డు మరమ్మత్తులు చెయ్యడం జరిగిందని తెలిపారు. వీటితో పాటు రెండు హైమాక్స్ లైట్ లు, రెండు బోర్ లు కూడా సాంక్షన్ చెయ్యడం జరిగిందని తెలిపారు. బడ్జెట్ ప్రకారంగా గ్రామానికి 30 లక్షలు అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కొత్తకొండ దేవస్థానం కు ఇంకా ఏమి అభివృద్ధి కావాలన్న చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్, ఎర్రంచెట్టి ఉపేందర్, కంకల సదానందం, పయ్యావుల రాజు, జనగాని కుమరస్వామి, జుర్రు అఖిల్, తదితరులు పాల్గొన్నారు.