కోతులు, కుక్కల బారి నుండి ప్రజలను రక్షించండి

★ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న

పయనించే సూర్యుడు జనవరి 9 (జనగామ ప్రతినిధి కమ్మ గానినాగన్న) పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో కోతులు, కుక్కల బెడదతొ ప్రజలు అడుగు బయట పెట్టాలంటే భయపడి పోతున్నారని ప్రజలను పంట పొలాలను, చిరు వ్యాపారులను, విద్యార్థులను వృద్ధులను రక్షించి నియంత్రణ చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మండల కార్యదర్శి మాచర్ల సారయ్య బెస్తవారం ప్రభుత్వాన్ని కోరారు పాలకుర్తి మండలంలోని దర్దపల్లి గ్రామంలో సిపిఎం శాఖ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి గ్రామ శాఖ కార్యదర్శి ముస్కు ఇంద్రారెడ్డి అధ్యక్షత వహించారుఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ కోతులు కుక్కలు బెడదతో గడిచినా సుమారు10 సంవత్సరాల నుండి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రజలు బయటికి వెళ్లాలంటే భయ ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు కోతుల, కుక్కల సమస్యను పరిష్కరించే ఆలోచనలో ప్రభుత్వాలు అధికారులు లేరని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ,ఫారెస్ట్ అధికారులు గ్రామపంచాయతీల సమన్వయంతో కోతులను పట్టి అడవిలో వదిలివేయాలని సూచించారు. అనేక గ్రామాలలో గుంపులు గుంపులుగా కోతులు , కుక్కలు రోడ్లపై, పంట పొలాల్లో తిరుగుతున్న కుక్కలు వాటికి ఎదురుగా కనిపించిన మనుషులపై దాడి చేస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారుఅధికారులు వాటి నియంత్రణను గాలికి వదిలేశారని ప్రజలు వాపోతున్నారని తెలిపారు. వివిధ గ్రామాలలో చిన్నపిల్లల , పెద్ద వారిపై సైతం గతంలో పలు సంఘటనలు జరిగినను పట్టించు కోవడం లేదని అన్నారు. ద్విచక్ర వాహనదారులను కూడా కుక్కలు రోడ్డు వెంట వెంబడిస్తున్నా చర్యలు చేపట్టకపోవడంతో గ్రామాలలో వందల సంఖ్యలో కుక్కలు సంఖ్య పెరిగిపోయిందని వివరించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరారుఈ కార్యక్రమంలో వి. కుమార్, యుగంధర్, ఎన్. పెద్దపురం, వి. సాంబాజి, వేల్పుల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు