పయనించే సూర్యుడు జనవరి 09 ఎన్ రజినీకాంత్ :- ఈ నెల 18న ఖమ్మం లో జరిగే 100 సంవత్సరాల బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం మండలంలోని ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తాలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు హాజరయ్యే మహా సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని, ఈ సభలో 100 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ నుండి చేసిన కార్యక్రమాలు, ఉద్యమాలను నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో పార్టీ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరారు. ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా, సిపిఎం వామపక్ష పార్టీల జాతీయ కార్యదర్శులు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు మంచాల రమాదేవి, మండల కార్యదర్శి ఆదరి రమేష్, నాయకులు సుంచు కుమారస్వామి, మార్పు సంజీవరెడ్డి, బోడ బాలరాజు, కవ్వం పల్లి కిషన్, చిలుక శీను, సన్నిల రవి, పిట్టల రమేష్, స్వామి, అరుణ్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..